విజయవాడ మ్యూజియాలను ప్రపంచానికి పరిచయం చేయనున్న NTR జిల్లా యంత్రాంగం
NTR జిల్లా యంత్రాంగం 'Local to Global' పేరుతో పర్యాటక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాపు మ్యూజియం, భవాని ద్వీపం, కొండపల్లి కిల్లా వంటి వారసత్వ కట్టడాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడం దీని లక్ష్యం.
మే 18న జరిగే ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 14 మ్యూజియాలను కలిపి ఒక వీడియో డాక్యుమెంట్ తయారు చేసి ప్రదర్శించనున్నారు. యువతను ఆకర్షించేందుకు musical concept తో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. చర్చలు, debates కూడా నిర్వహించనున్నారు.
జిల్లాలో service sector contribution 76% ఉందని, పర్యాటకం పెరిగితే ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే Local to Global కాన్సెప్ట్ ద్వారా tourism activities ప్రొమోట్ చేస్తున్నామని వారు తెలిపారు.
విజయవాడలోని బాపు మ్యూజియం చారిత్రకంగా ప్రముఖమైనది. 1921 ఏప్రిల్ 1న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు ఇక్కడ జరిగాయి. ఆ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండాను గాంధీకి అందజేసిన సందర్భానికి గుర్తుగా పాత భవనంలో mural art ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com