తెలంగాణ

గాంధీ హాస్పిటల్‌లో నర్సింగ్ విద్యార్థిని పల్లవి మృతి — కుటుంబం నిర్లక్ష్యం ఆరోపణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గాంధీ హాస్పిటల్‌లో నర్సింగ్ విద్యార్థిని పల్లవి మృతి — కుటుంబం నిర్లక్ష్యం ఆరోపణ
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థిని పల్లవి గౌడ్ మృతి చెందింది. గాంధీ మెడికల్ కాలేజీలో BSc OTT సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె, chest లో గడ్డకు సంబంధించిన చిన్న సర్జరీ కోసం అడ్మిట్ అయింది.

మార్చి 18న అడ్మిట్ అయిన పల్లవికి సర్జరీ చేశారు. అదే రోజు సాయంత్రం అధిక రక్తస్రావం జరిగిందని కుటుంబం తెలిపింది. మార్చి 19న తొమ్మిది మంది సీనియర్ డాక్టర్లు మళ్లీ సర్జరీ చేశారు. మార్చి 22కి ఆమె పరిస్థితి విషమించింది. చివరకు ventilator support, అన్ని రకాల చికిత్సలు ఇచ్చినప్పటికీ పల్లవి మృతి చెందింది.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబం హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టింది. కుటుంబం ఫిర్యాదు చేయడంతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

హాస్పిటల్ అధికారులు సర్జరీలో జరిగిన పొరపాటేదైనా ఉందా లేదా అనేది ఎంక్వయరీ చేస్తున్నామని తెలిపారు. సర్జరీ చేసిన టీంలో ఎవరెవరు ఉన్నారో స్పష్టత రాలేదు. దర్యాప్తు జరుగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com