హైదరాబాద్ 24°C
అమరావతి 27°C
IST 2:53 AM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

సీనియర్ నటి పావలా శ్యామల జూలై 28 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో మరణించారు. ఆమెకు 1:52 నిమిషాలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. ఆర్థిక ఇబ్బందులతో గడిపిన శ్యామలకు గతంలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గతేజ్, దిల్రాజ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు.

1985లో 'బాబాయి అబ్బాయి' చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన శ్యామల, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఆంధ్రావాలా', 'గోలిమార్' వంటి సినిమాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమలో విషాదం నింపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com