పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూటమిలో చర్చకు దారి తీశాయి
జనసేన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చర్చకు దారి తీశాయి.
గతంలో పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండాలని చెప్పారు. అయితే ఈ సమావేశంలో అందుకు భిన్నంగా మాట్లాడారు. తాను ప్రేమిస్తానని, తిరిగి అదే ప్రేమను ఆశిస్తానని పేర్కొన్నారు.
TDP తో పొత్తు విషయంలో వివరణ ఇస్తూ, ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు, YSRCP పాలన సమయంలో వేరే మార్గం లేక పొత్తుకు వెళ్ళినట్లు వివరించారు. 2019లో సింగిల్‌గా వెళ్ళి రెండు చోట్ల ఓడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అవసరమైతే చంద్రబాబుతో కూడా విభేదిస్తానని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాక జై అమరావతి నినాదం వద్దని, జై ఆంధ్ర నినాదం ముద్దని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై TDP నేతల్లో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతున్న నేపథ్యంలో పవన్ జై అమరావతి అనొద్దని చెప్పడం అమరావతి రైతుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై కూడా చర్చ నడుస్తోందట. ఈ వ్యాఖ్యలపై CM చంద్రబాబు నాయుడు స్పందన తెలియాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com