అటవీ శాఖ అధికారులపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక — గ్రీన్ కవర్, భూ ఆక్రమణలపై కీలక ఆదేశాలు
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించే లక్ష్యంతో చేపట్టిన Great Green Wall ప్రాజెక్టును నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను హెచ్చరించారు. ఒక వారం లోపు AP Green Society ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చైనా, జపాన్, సింగపూర్ దేశాల్లో స్వాధీనమైన AP ఎర్రచందనాన్ని దేశానికి తిరిగి తీసుకు రావడంలో ఎంత పురోగతి ఉందని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లా మంగళం అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబం ఆక్రమించినట్లు గుర్తించిన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లాలో సజల రామకృష్ణ రెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూమిని కూడా వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు తొలగించి, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంత అటవీ భూమి ఆక్రమణకు గురైంది, ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఎవరిపై కేసులు నమోదు చేశారు అనే వివరాలు అటవీ శాఖ website లో పొందుపరచాలని చెప్పారు.
అటవీ సరిహద్దుల పర్యవేక్షణకు Karnataka model అనుసరించాలని సూచించారు. అటవీ భూముల రక్షణకు geo-tag సర్వే నిర్వహించాలన్నారు. చట్ట విరుద్ధంగా భూమి ఆక్రమణలు, చెట్ల నరికివేత జరిగిన వెంటనే అధికారులకు తెలిసేలా satellite సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com