జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు ₹3 పెరిగాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు ₹3 పెరిగాయి
📷 Mark Stebnicki / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు సగటున ₹3 పెంచింది. నేటి ఉదయం ఆరు గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

విజయనగరం జిల్లాలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఈ పెంపుపై స్పందించారు. ధర పెరుగుతుందని ముందే ఊహించామని, కానీ ఊహించినదానికంటే తక్కువే పెరిగిందని వారు తెలిపారు.

ప్రస్తుతం international market లో డీజిల్ ధర లీటర్‌కు ₹153 గా ఉంది. కానీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్ల వినియోగదారులకు ₹100కే లభిస్తోంది. పరిశ్రమలకు మాత్రం ₹153 చెల్లించాల్సి ఉంటోందని నిర్వాహకులు తెలిపారు.

విజయనగరం జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత stock ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు. supply లో ఎలాంటి సమస్య లేదని, sales కూడా సాధారణంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

గతంలో social media వార్తల కారణంగా panic buying జరిగిందని నిర్వాహకులు వివరించారు. సాధారణంగా రోజుకు 7,000–8,000 లీటర్లు అమ్ముడవ్వే చోట panic సమయంలో 20,000–25,000 లీటర్లు అయిపోయాయని వారు చెప్పారు. ఇది stock కొరత వల్ల కాదు, panic వల్లే అని స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం దగ్గర రెండు నెలలకు సరిపడే నిల్వలు ఎప్పుడూ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com