జాతీయం

లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫారసు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫారసు
📷 Mark Stebnicki / Pexels
షేర్ కాపీ అయింది ✓

దేశంలో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (PM-EAC) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో 373 స్థానాలను యథాతథంగా ఉంచాలని, మిగిలిన 170 స్థానాలను విభజించాలని సూచించింది. ఇందులో 59 స్థానాలను రెండుగా, 111 స్థానాలను మూడు నియోజకవర్గాలుగా విభజించాలని ప్రతిపాదించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు నియోజకవర్గాలను మూడు నియోజకవర్గాలుగా విభజించాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాలుగా చేయాలని సిఫారసు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడుగా, చేవెళ్లను రెండు నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది.

చిన్న నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని గత ఎన్నికల విశ్లేషణలో తేలిందని, దీంతో నియోజకవర్గాల విభజన ద్వారా ఓటింగ్ శాతం 2.32% పెరుగుతుందని మండలి అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3.52%, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడేవారు 64%, తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ 5.15% ఉన్నారని, అందువల్ల హైదరాబాద్ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలని సూచించినట్లు నివేదిక పేర్కొంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com