హైదరాబాద్ 24°C
అమరావతి 27°C
IST 1:43 AM
శనివారం ఆగస్టు 1 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో చెవిటి-మూగ విద్యార్థిపై దాడి.. తల్లి ఫిర్యాదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ప్రకాశం జిల్లాలో చెవిటి-మూగ విద్యార్థిపై దాడి.. తల్లి ఫిర్యాదు
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

చెవిటి, మూగ వైకల్యం ఉన్న ఆ విద్యార్థిని అదే కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కలిసి దాడి చేసి, అవమానకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది.

వీడియో చూసిన బాధిత విద్యార్థి తల్లి కళాశాలకు చేరుకొని, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుమారుడికి మాట్లాడటం, వినడం రాదని, ఉదయం మాత్రలు వేసుకుని కళాశాలకు వస్తాడని తల్లి వాపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు వెళ్లి సంబంధిత విద్యార్థులను విచారించారు. అయితే ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం తొలగించి, టీసీలు ఇచ్చినట్లు సమాచారం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com