హైదరాబాద్ 24°C
అమరావతి 28°C
IST 2:34 AM
సోమవారం ఆగస్టు 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

యాదాద్రి రాచకొండ ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్: 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫిడ్రోన్ స్వాధీనం; నలుగురు అరెస్టు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
యాదాద్రి రాచకొండ ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్: 54 కోట్ల విలువైన 27 కేజీల మెఫిడ్రోన్ స్వాధీనం; నలుగురు అరెస్టు
📷 MART PRODUCTION / Pexels
షేర్ కాపీ అయింది ✓

యాదాద్రి రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భారీ డ్రగ్స్ ఆపరేషన్ చేపట్టారు. 54 కోట్ల రూపాయల విలువైన 27 కిలోల మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండమడుగు ప్రాంతంలోని వేటుకూరి లాబ్స్ లో మెఫిడ్రోన్ తయారీ జరుగుతోందని సమాచారం అందింది. దీంతో నిఘా పెంచి, నిందితులు నాగ్పూర్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఫార్చునర్ కారు, 40 కిలోల అసిటోన్ లిక్విడ్ కూడా సీజ్ చేశారు. డ్రగ్స్ తయారీ లాబ్ ను సీల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com