హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 4:05 PM
ఆదివారం ఆగస్టు 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో వర్షం కోసం వానదేవర పూజలు; భారీ వర్షంతో గ్రామస్థుల సంబరాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చిత్తూరు జిల్లాలో వర్షం కోసం వానదేవర పూజలు; భారీ వర్షంతో గ్రామస్థుల సంబరాలు
📷 Keith Lowery / Pexels
షేర్ కాపీ అయింది ✓

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుకూరు గ్రామంలో వర్షాల కోసం గ్రామస్థులు వానదేవర పూజలు చేపట్టారు. చెరువులో ఈ పూజలు జరిపారు. పూజలు జరుగుతుండగా ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి, ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకొన్నాయి. భారీ వర్షం కురిసింది.

ఊహించని ఈ వర్షంతో గ్రామస్థులు ఎంతో సంతోషించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ వర్షంలో తడుస్తూ డ్యాన్సులు చేసి, చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు.

గత కొన్ని రోజులుగా తాగునీటి, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ గ్రామస్తులకు ఈ వర్షం ఊరట కలిగించింది. వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com