ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో AMCA, BDL సహా నాలుగు రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పుట్టపర్తిలో AMCA, BDL సహా నాలుగు రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన
📷 Monirul Islam / Pexels
షేర్ కాపీ అయింది ✓

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. CM చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదటి ప్రాజెక్టు AMCA — అంటే Advanced Medium Combat Aircraft. ఇది 5వ తరం యుద్ధ విమానం. దీని కోసం Aeronautical Development Agency (ADA) Core Integration మరియు Flight Testing Centre పుట్టపర్తిలో నిర్మితమవుతోంది. ADA, DRDO కి అనుబంధ సంస్థ. ఈ సంస్థే గతంలో LCA తేజస్ మార్క్ 1 అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్క్ 2 పనులు జరుగుతున్నాయి. AMCA మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు ₹15,000 కోట్లు. ఇందులో Core Integration Facility మరియు Flight Testing Centre ₹రవేల కోట్ల వ్యయంతో AP లో ఏర్పాటవుతోంది. ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి 5వ తరం యుద్ధ విమానాలు ఉన్నాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

రెండో ప్రాజెక్టు Bharat Dynamics Limited (BDL) — రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని public sector సంస్థ. ఇది ₹80 కోట్ల వ్యయంతో స్వదేశీ underwater systems కేంద్రం ఏర్పాటు చేస్తోంది. Autonomous Underwater Vehicles, Underwater Countermeasure Systems మరియు Next Generation Torpedoes ఈ యూనిట్ లో అభివృద్ధి చేస్తారు.

కర్నూల్ లో 8 drone కంపెనీలు కలిసి Drone City ఏర్పాటు చేస్తున్నాయి. ఇది నేడు ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ — ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉన్న నేపథ్యంలో జాతీయ భద్రతలో ఇతర దేశాలపై ఆధారపడడం సాధ్యం కాదని అన్నారు. స్వదేశీ రక్షణ సామర్థ్యం పెంచుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు చారిత్రక మైలురాయి అని ఆయన అన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com