శిరిడీలో ₹3,000 కోట్ల ప్రైవేట్ డిఫెన్స్ తయారీ కేంద్రం ప్రారంభం
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మహారాష్ట్రలోని శిరిడీ సమీపంలో భారీ డిఫెన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ₹3,000 కోట్ల పెట్టుబడితో NIB యాజమాన్యం ఈ సంస్థను నెలకొల్పింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవీస్, CDS అనిల్ చౌహాన్ హాజరయ్యారు.
ఈ కేంద్రంలో క్షిపణులు, అధునాతన డ్రోన్లు తయారు చేస్తారు. 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్న సూర్యాస్త్ర క్షిపణిని ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. చండీపూర్, లడఖ్ లోని పోక్రాన్‌లో ఈ కేంద్రం తయారు చేసిన క్షిపణులను పరీక్షించారు.
100 km నుంచి 1,000 km రేంజ్ ఉన్న suicide డ్రోన్లను కూడా ఇక్కడ తయారు చేస్తారు. వాయవాస్త్ర అనే loitering munition డ్రోన్ కు భారత సైన్యం RFP కింద trials పూర్తయ్యాయి. DRDO నుంచి కూడా ఈ సంస్థకు ప్రతిపాదనలు అందుతున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదే సమయంలో గుజరాత్ లోని వడోదరాలో Tata Advanced Systems Limited తొలి Made in India సైనిక రవాణా విమానాన్ని రూపొందించింది. ఒక ప్రైవేట్ సంస్థ పూర్తి స్థాయి సైనిక విమానాన్ని తయారు చేయడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విమానం ఒకేసారి 9,000 కిలోల సరుకు లేదా 71 మంది సైనికులను తరలించగలదు. చిన్న రన్‌వేలు, మట్టి రన్‌వేలపై కూడా దిగే సామర్థ్యం ఈ విమానానికి ఉంది.
సైన్యానికి AK-47 రైఫిళ్లతో పాటు అధునాతన రైఫిళ్లు తయారు చేయడంలో Adani సంస్థ కూడా రక్షణ రంగంలో పాల్గొంటోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com