హైదరాబాద్ 27°C
అమరావతి 31°C
IST 8:10 PM
మంగళవారం జూలై 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

26 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు.. ప్రజలకు అందనున్న సేవలు ఏమిటి?

రచన: ఉషా కిరణం డెస్క్ ·
26 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు.. ప్రజలకు అందనున్న సేవలు ఏమిటి?
📷 Monirul Islam / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం GO నంబర్ 396 విడుదల చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటే RSK లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టెండర్లు పిలవనున్నారు.

రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే విభాగాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ఈ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా మిగతా 26 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ RSK లను ప్రారంభించేందుకు రూపకల్పన చేశారు.

మహారాష్ట్రలో అమలవుతున్న ఆదర్శ సబ్ రిజిస్ట్రార్ కేంద్రాల విధానాన్ని పరిశీలించి ఇక్కడ అమలు చేయనున్నారు. కక్షిదారుల నుంచి రూ. 2,000 ఫీజు వసూలు చేసే విధంగా నిర్ధారించారు. ఆస్తుల క్రయ విక్రయాలు, పొలాలు, స్థలాలు, ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

ప్రస్తుత విధానంలో దస్తావేజు లేఖర్లు డాక్యుమెంట్లు తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్లోడ్ చేస్తున్నారు. కొత్త విధానంలో ఏజెన్సీలకు పని అప్పగించి పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టం ద్వారా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా లైసెన్సులు ఇచ్చి భాగస్వాముల్ని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త విధానం భవిష్యత్తులో ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com