తెలంగాణ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర CM కు రేవంత్ రెడ్డి లేఖ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర CM కు రేవంత్ రెడ్డి లేఖ
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు విషయంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ CM రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి అనుకూలమైన తేదీ త్వరగా ఖరారు చేయాలని కోరారు.

148 మీటర్ల Full Reservoir Level (FRL) తో తెలంగాణ నీటి అవసరాలు తీరవని లేఖలో తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. FRL పెంచితే gravity ద్వారా నీరు తరళించవచ్చని, మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగా ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు.

ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన తెలియాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com