యాదాద్రిలో 100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకు స్థాపన
తెలంగాణ CM రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. మంత్రులతో కలిసి ఐదు ప్రాజెక్టులకు ఒకేసారి భూమి పూజ నిర్వహించారు.
ఈ ప్రాజెక్టుల్లో 43.79 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల్లో నిర్మించే ఆధునిక వేద పాఠశాల ముఖ్యమైనది. 43.12 కోట్ల వ్యయంతో కొండపై దీక్షాపరుల భవనం, 9.87 కోట్లతో నిత్య కళ్యాణ మండపం నిర్మాణాలకు కూడా శంకు స్థాపన జరిగింది. కొండపైకి వెళ్ళే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, మాడ వీధుల్లోకి వెళ్ళే మెట్ల మార్గం నిర్మాణాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి, శాసన మండలి చైర్మన్ గుత్త సుకేందర్ రెడ్డి, మంత్రులు కొమటిరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంపుల్ సిటీలో ఐదు శిలా ఫలకాలను ఒకేచోట ఆవిష్కరించారు.
హైదరాబాద్ నుంచి helicopter లో వచ్చిన CM, కంచి పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని గర్భాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో ఒక లోపం చోటు చేసుకుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం CM కొండ కింద హెలిప్యాడ్‌లో దిగాల్సి ఉండగా, helicopter టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌లో దిగింది. అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో CM మంత్రులతో దాదాపు 10 నిమిషాలు helicopter లోనే వేచి ఉన్నారు. తర్వాత అధికారులు అక్కడికి చేరుకొని స్వాగతం పలికారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com