హైదరాబాద్ 25°C
అమరావతి 30°C
IST 8:25 AM
సోమవారం ఆగస్టు 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కస్టోడియల్ మరణం కేసు: సీఐ నాగరాజుపై నాలుగో రోజు సిట్ విచారణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సాయి కృష్ణ కస్టోడియల్ మరణం కేసు: సీఐ నాగరాజుపై నాలుగో రోజు సిట్ విచారణ
📷 MART PRODUCTION / Pexels
షేర్ కాపీ అయింది ✓

సాయి కృష్ణ కస్టోడియల్ మరణం కేసులో సీఐ నాగరాజుపై నాలుగో రోజు కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దాదాపు 8 గంటల పాటు ఎస్పీ నయీమ్ నేతృత్వంలోని సిట్ బృందం నాగరాజును ప్రశ్నించింది.

ఈసారి విచారణలో కేసులో A4 నిందితుడు ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ పాత్రపైనే ఎక్కువగా దృష్టి సారించింది. సురేష్తో నాగరాజుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అతను స్టేషన్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకునేవాడు, స్టేషన్ సీసీటీవీ ఫూటేజీ ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారా, సాయి కృష్ణను కస్టడీలో హింసించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, పీటీ వారెంట్పై తీసుకొచ్చిన వ్యక్తిని కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు అనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కీలక ప్రశ్నలకు నాగరాజు మౌనం వహించినట్లు సమాచారం. దీంతో వాస్తవాలు రాబట్టేందుకు సిట్ మరింత వ్యూహాత్మకంగా విచారణ కొనసాగిస్తోంది. ఇవాళ కూడా సిట్ బృందం నాగరాజును ప్రశ్నించనుంది.

మరోవైపు పరారీలో ఉన్న సురేష్ గురించి సమాచారం ఇవ్వాలని సిట్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. కేసు నమోదైన నాటి నుంచి సురేష్ అజ్ఞాతంలో ఉన్నాడని, అతను దొరికితే నాగరాజుతో కలిపి విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com