హైదరాబాద్ 23°C
అమరావతి 25°C
IST 3:46 AM
శుక్రవారం అక్టోబర్ 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

నా భర్తలో ఈ లక్షణాలు ఉండాలి అని మనసులోని మాటను బయటపెట్టిన సాయి పల్లవి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నా భర్తలో ఈ లక్షణాలు ఉండాలి అని మనసులోని మాటను బయటపెట్టిన సాయి పల్లవి
📷 Erik Uruci / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రస్తుతం రామాయణ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్న నటి సాయి పల్లవికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి షోకి వెళ్ళిన సాయి పల్లవిని అమితాబ్ బచ్చన్ మీ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు అంటూ నేరుగా ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు సాయి పల్లవి నవ్వుతూ సిగ్గుపడుతూ అంతే నమ్మకంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు కాబోయే భర్త మంచి మనిషి అయి ఉండాలని ఆమె స్పష్టంగా చెప్పారు. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కాకూడదని తన ప్రవర్తనను తాను విశ్లేషించుకోగలగాలని ఆమె అభిప్రాయపడ్డారు.

తాను చేసే పనులను పరిశీలించుకోవడమే కాదు జీవితంలో తాను ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకునే పరిణతి కూడా ఉండాలని సాయి పల్లవి చెప్పారు. తప్పులు చేయవచ్చు కానీ వాటిని సరిదిద్దుకోవాలని తన తప్పులకు ఇతరులను నిందించకూడదని ఆమె వివరించారు. అంతేకాదు వంట చేయడం కూడా తెలిస్తే ఇంకా మంచిది అంటూ చమత్కారంగా చెప్పిన సాయి పల్లవి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com