సరస్వతి అంత్య పుష్కరాలు: కాళేశ్వరంలో 12 రోజుల వేడుకలు
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేతుల మీదగా తొలి పుష్కర స్నానం జరిగింది.
త్రివేణి సంగమంలో 12 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రతి రోజు వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహిస్తారు. గోదావరి హారతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులు వస్తారని అంచనా. traffic, parking విషయంలో భక్తులు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com