తెలంగాణ సీఎస్‌తో SBI అధికారుల భేటీ; రాయదుర్గం భూమి వివాదంపై చర్చ
హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్లో SBI సర్కిల్ జనరల్ మేనేజర్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.
రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1 లో ఉన్న ఐదు ఎకరాల భూమి వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ SBI ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆ వేలంపై స్టే ఇచ్చింది. అయితే, SBI హైకోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ కారణంగా SBI కి ఉన్న లీడ్ బ్యాంకు హోదాను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం తన ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్ల నిధులు అన్నీ సుమారు 4,000-5,000 కోట్ల రూపాయలను SBI నుండి ఇతర బ్యాంకులకు మార్చేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెల పంపుతున్న నిధులను కూడా SBI నుండి తరలించనున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, SBI తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే RBI కి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సీఎస్ రామకృష్ణారావు కూడా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీకి అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది; రేపు ఈ భేటీ జరగవచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com