సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడిఫికేషన్ పనులు 64% పూర్తయ్యాయి: కేంద్ర మంత్రి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 64% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. 714.73 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.
స్టేషన్ పనుల తాజా వివరాలను కేంద్ర మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, పూర్తయ్యాక ఎయిర్పోర్టు తరహా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఎయిర్ కాన్కోర్స్, మల్టీ లెవల్ పార్కింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ప్రయాణికుల సౌకర్యం కోసం 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సిద్ధమవుతోంది. స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ వరకు నేరుగా వెళ్లేలా స్కై వాక్ నిర్మాణం జరుగుతోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ అంతటా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం హై డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు అమరుస్తున్నారు. తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ భవనం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్ ప్రధాన అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com