హైదరాబాద్ 31°C
అమరావతి 35°C
IST 3:22 PM
ఆదివారం ఆగస్టు 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఇంద్రకీలాద్రిలో భద్రతా లోపం: రాజగోపురం వద్ద మహిళ రీల్స్ రికార్డింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విజయవాడ ఇంద్రకీలాద్రిలో భద్రతా లోపం: రాజగోపురం వద్ద మహిళ రీల్స్ రికార్డింగ్
📷 Ansh Yati / Pexels
షేర్ కాపీ అయింది ✓

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం చోటుచేసుకుంది.

రాజగోపురం సమీపంలో ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలయంలోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని నిరంతరం ప్రకటనలు చేస్తున్నా, ఫోన్ ఎలా లోపలికి వచ్చిందనేది ప్రశ్నగా మారింది. ఈ రీల్స్ రికార్డ్ చేసిన ప్రదేశం ఎదురుగానే ఆలయ చైర్మన్ కార్యాలయం, స్థానాచార్యుల కార్యాలయం, పాలకమండలి సభ్యుల కార్యాలయాలు ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది అక్కడే పర్యవేక్షిస్తున్నా, వారు ఈ ఘటనను పట్టించుకోలేదు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అమ్మవారి మూలవిరాట్ విగ్రహం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగించారు. మరో మహిళ అంతరాలయం లోపల విగ్రహం ఫోటో తీయడంపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

భక్తులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ఈవో సీనా నాయక్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ ఎలా లోపలికి వచ్చింది, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎవరు అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ మహిళపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com