సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వారాహి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది.
ఆనువంశిక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక్ గజపతి రాజుతో కలిపి 17 మంది ధర్మకర్తలు ప్రమాణం చేశారు. ఆలయ EO వెంకట్రావ్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ అశోక్ గజపతి రాజు virtual గా పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన ధర్మకర్తలు హిందూ దేవాదాయ చట్టం 30/1, 1987 ప్రకారం తమ విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చట్టానికి లోబడి పని చేయడంతోపాటు భక్తుల సౌకర్యాలు మరియు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com