ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ కొనసాగుతోంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ కొనసాగుతోంది
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో SIR ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 24 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల పరిధిలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను అందించనున్నారు. ఈ సర్వే ప్రక్రియలో 36,000 మంది BLO లు పాల్గొంటున్నారు. జూలై 24 లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించే అవకాశం ఉంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఓటర్లు ఎన్యుమరేషన్ పత్రాలను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ECI అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ SIR ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా సుమారు 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం 2002 నాటి ఓటర్ జాబితాను ప్రాతిపదికగా చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేస్తున్నారు. క్లెయిమ్లు మరియు అభ్యంతరాల పరిశీలన తర్వాత 2026 సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com