హైదరాబాద్ 24°C
అమరావతి 28°C
IST 2:24 AM
సోమవారం ఆగస్టు 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణ
📷 Tsvetoslav Hristov / Pexels
షేర్ కాపీ అయింది ✓

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించింది.

సిట్ అధికారులు ఇప్పటికే నలుగురు కానిస్టేబుల్లను ఐదు రోజుల పాటు ప్రశ్నించారు. చివరి రోజు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, కానిస్టేబుల్లను కూడా పిలిపించి, నిందితులందరినీ ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు.

ఈ విచారణ సందర్భంగా సిట్ బృందం నిందితులకు కొన్ని ఫోటోలు, వీడియోలు చూపించింది. ఆధారాల ధ్వంసం, డీవీఆర్ తొలగింపుపై ప్రత్యేకంగా ప్రశ్నించింది. సాయి కృష్ణను ఎక్కడికి తీసుకెళ్లారని అడగ్గా, ఈ వ్యవహారం అంతా సీఐ నాగరాజుకు తెలుసని కానిస్టేబుల్లు తెలిపారు.

ఈ విచారణలో సిట్ బృందం పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com