కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ మృతి కేసులో సిట్ విచారణ ఉద్ధృతం
కృష్ణలంకలో సాయి కృష్ణ లాకప్ మృతి కేసును సిట్ బృందం ముమ్మరంగా విచారిస్తోంది. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించేందుకు వ్యూహాలు రచిస్తున్న సిట్, ఇవాళ నలుగురు కానిస్టేబుల్స్‌ను ఒకేచోట ఉంచి ప్రశ్నించనుంది. ఇప్పటికే మార్కాపురం నుంచి విజయవాడ వరకు ప్రయాణానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్, ఫొటోలు సేకరించిన అధికారులు ఆ సాక్ష్యాలను చూపించి విచారించే అవకాశం ఉంది.
విచారణ ఎదుర్కొంటున్న అశోక్ కుమార్, జంగం నాని, బాబురావు, సాంబయ్య అనే నలుగురు కానిస్టేబుల్స్ ఇప్పటి వరకు తమకు ఏమీ తెలియదని, సీఐ నాగరాజుకే అన్ని వివరాలు తెలుసని చెబుతున్నారు. నలుగురి కస్టడీ నేటితో ముగియనుంది. కస్టడీ పూర్తయిన తర్వాత వారిని రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్. శ్రీకాంత్ ఆయన నివాసం వద్ద హాజరుపర్చనున్నారు. ఆ తర్వాత వారిని జైలుకు తరలిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com