పెళ్లి రద్దు కంటే హత్యే సులభమన్న సియా: పుణే మర్డర్ కేసులో కీలక వాంగ్మూలం
పుణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందుతురాలు సియా గోయల్ పోలీసుల విచారణలో కీలక వాంగ్మూలం ఇచ్చింది. పెళ్లిని రద్దు చేసి తల్లిదండ్రులను బాధ పెట్టడం కంటే కేతన్‌ను హత్య చేయడమే తనకు సులభంగా అనిపించిందని ఆమె చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 18న సియా, కేతన్‌తో కలిసి లోహగడ్ కోటకు వెళ్లింది. అక్కడ ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరి సాయంతో కేతన్‌ను లోయలోకి తోసేసింది. దీంతో కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. వీరిద్దరి వివాహం నవంబర్‌లో జరగాల్సి ఉంది.
పోలీసులు సియా, చేతన్‌లను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సియా సోదరుడు సాహిల్‌ను 10 గంటల పాటు విచారించగా, సియా, చేతన్‌లు ఒక క్రికెట్ మ్యాచ్‌లో పరిచయమయ్యారని, గతఏడాది దీపావళి సందర్భంగా ఒక స్నేహితుని పార్టీలో మొదటిసారి కలిశారని తెలిపారు. సియా తల్లిదండ్రులు మాత్రం చేతన్‌ను ఎప్పుడూ కలవలేదని, అతడితో మాట్లాడలేదని విచారణలో చెప్పారు.
ఈ కేసు కోసం పుణే గ్రామీణ పోలీసులు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com