హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:38 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

వేసవిలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పేలుళ్లు: జాగ్రత్తలు ఏంటి?

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వేసవిలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పేలుళ్లు: జాగ్రత్తలు ఏంటి?
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏలూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 డిగ్రీల వరకు చేరుకుంటాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం పెరుగుతోందని ఏలూరులోని నాగధనలక్ష్మి మొబైల్స్ టెక్నికల్ ఇంజనీర్ బాలు తెలిపారు.

ఎండలో తిరిగిన వెంటనే ఫోన్‌కు చార్జింగ్ పెట్టడం అత్యంత ప్రమాదకరమని బాలు చెప్పారు. ఫోన్ ఆల్రెడీ వేడిగా ఉండగా మళ్ళీ చార్జింగ్ వేస్తే వేడి మరింత పెరిగి బ్యాటరీ పేలిపోతుందని వివరించారు. ఇంటికి వచ్చాక ముందు ఫోన్‌ని చల్లబరచుకొని, ఆ తర్వాతే చార్జింగ్ పెట్టాలని సూచించారు.

ఫోన్‌తో పాటు వచ్చిన కంపెనీ adapter మాత్రమే వాడాలని బాలు హెచ్చరించారు. third party adapters వాడటం వల్ల motherboard వేడెక్కి బ్యాటరీ పేలే ప్రమాదం ఉందన్నారు. రాత్రిపూట తల దగ్గర ఫోన్ పెట్టుకొని చార్జింగ్ పెట్టి పడుకోవడం కూడా ప్రమాదమేనని తెలిపారు. ఒక ఘటనలో పరుపు కింద ఉంచిన ఫోన్ బ్లాస్ట్ అయిందని చెప్పారు.

బైక్ tank దగ్గర ఫోన్‌కు చార్జింగ్ పెట్టడం వల్ల బైక్ పేలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. Electric vehicles లో కూడా తడిసిన లేదా పాడైన charging cable వాడితే short circuit అయ్యి వాహనం పేలిపోవచ్చని తెలిపారు.

నాలుగైదు సంవత్సరాలు వాడిన ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోతుంటే వెంటనే service centre కు వెళ్లి replace చేయించుకోవాలని సూచించారు. power bank కూడా వేడి లేనప్పుడు, ఎండ లేనప్పుడు మాత్రమే వాడాలని తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com