హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 10:18 AM
శనివారం ఆగస్టు 1 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 1,965 ప్రత్యేక బస్సులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి 1,965 ప్రత్యేక బస్సులు
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేడు జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు బస్సుల ద్వారా తరలివెళ్తున్నారు.

విశాఖ జిల్లా నుంచి 1,465 బస్సులు, అనకాపల్లి జిల్లా నుంచి 500 బస్సులు సిద్ధం చేశారు. ఇదివరకే అల్లూరి జిల్లా నుంచి 140 బస్సుల్లో గిరిజన విద్యార్థులు, కళాకారులను తరలించారు. 11 మండలాల నుంచి 46 బస్సుల్లో వారిని ఇప్పటికే పంపించారు.

ప్రజల రాకపోకల కోసం జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఇంచార్జిలుగా నియమించారు. మూడు ప్రధాన మార్గాల్లో బస్సులు నడుపుతున్నారు. ప్రతి బస్సుకు జీపీఎస్ ఏర్పాటు చేసి, కలెక్టరేటులో కంట్రోల్ రూమ్ ద్వారా వాటి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సభ అనంతరం వివిధ చోట్ల భోజన ఏర్పాట్లు చేశారు. ఉత్తర జోన్ కు 150 బస్సులు, 6000 మందిని అకామిడేట్ చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయి.

ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. నియోజకవర్గాల వారిగా ప్రజలను బస్సుల్లో భోగాపురానికి తీసుకెళ్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com