నిజాంపేట్‌లోని శ్రీశ్రీ హాస్పిటల్‌లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం
నిజాంపేట్‌లోని శ్రీశ్రీ హాస్పిటల్ గుండె లయ తప్పడం (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) సమస్యలకు చికిత్స అందించే ప్రత్యేక ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ధనంజయ్ లక్కీ రెడ్డి, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వీఎస్ రామచంద్ర ఈ కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.
ఇక్కడ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్, 3డీ మ్యాపింగ్ గైడెడ్ ఎలక్ట్రో ఫిజియాలజీ వంటి అత్యాధునిక సాంకేతికలను ఉపయోగించి సంక్లిష్ట గుండె రిథమ్ సమస్యలకు చికిత్స చేస్తారు. ఈ విధానంతో కొంతమంది రోగులు ప్రక్రియ అనంతరం ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయినట్టు వైద్యులు తెలిపారు.
ఈ కేంద్రంలో కార్డియాలజిస్టులు, ఎలక్ట్రో ఫిజియాలజిస్టులు, కార్డియో థొరాసిక్ సర్జన్లు, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టులు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఒకే చోట సేవలందిస్తారు. పోషకాహార నిర్వహణ, ఒత్తిడి తగ్గింపు, యోగా, ధ్యానం వంటి జీవనశైలి మార్పులపై ప్రత్యేక దృష్టి పెడుతూ సమగ్ర చికిత్స అందజేయడమే లక్ష్యమని డాక్టర్ ధనంజయ్ లక్కీ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఏకీకృత కార్యక్రమం తాము అమెరికాలోని తమ హాస్పిటల్‌లో ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com