శ్రీశైలంలో భారీ వరద: 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో, నీటి నిల్వ 101 టీఎంసిలకు
శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు పైగా కొనసాగుతుండగా, నీటి నిల్వ 101 టీఎంసిలకు చేరింది.
జూరాల ప్రాజెక్టు నుంచి 2,85,944 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి వస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 885 అడుగుల గరిష్టానికి 858 అడుగులకు చేరింది.
గత నెల 27వ తేదీ నాటికి శ్రీశైలం నిల్వ కేవలం 41 టీఎంసిలు మాత్రమే ఉండగా, వారం రోజుల్లోనే 60 టీఎంసిల వరద నీరు చేరింది. వరద ప్రవాహం మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నిల్వ గరిష్టంగా 150 టీఎంసిల వరకు చేరవచ్చు.
ప్రవాహం తగ్గిన తర్వాత ఐఏబి (Interstate Advisory Board) సమావేశం నిర్వహించి నీటి విడుదలపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. గరిష్ట నీటి మట్టం 1633 అడుగులకు 1616 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం 105 టీఎంసిలు కాగా, ప్రస్తుతం 51 టీఎంసిలుగా ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com