NEET పేపర్ లీక్: NTA పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం — మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి
NEET పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఎన్ని ఆదేశాలు ఇచ్చినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని కోర్ట్ మండిపడింది.
పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్ట్ విచారించింది. కేంద్ర ప్రభుత్వం, NTA, CBI లకు నోటీసులు జారీ అయ్యాయి. FAIMA, UDF సంస్థలు పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టును ఆశ్రయించాయి. NTA స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకురావాలని లేదా సంపూర్ణ ప్రక్షాళన చేయాలని ఈ సంస్థలు కోరాయి.
గత నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత 2024 నవంబర్ 14న సుప్రీం కోర్ట్ జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫారసులను ఎంతవరకు అమలు చేశారో స్పష్టం చేస్తూ మూడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని NTA కి ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ రాధాకృష్ణన్ కూడా సిఫారసుల అమలుపై తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా కర్ణాటకలో నీట్ విద్యార్థిని భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష రద్దుతో తమ కుమార్తె తీవ్ర మనస్థాపం చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గత 12 రోజుల్లో ఇలాంటి మరణాలు 5కి చేరాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com