తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు — మహబూబ్‌నగర్‌లో అత్యధిక వర్షపాతం
తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మల్గరలో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కోయలకొండ మండలం పరపల్లిలో 10 సెంటీమీటర్లు, భూత్పూర్‌లోనూ 10 సెంటీమీటర్లు నమోదైంది. మహబూబ్‌నగర్ టౌన్‌లో 7.5 సెంటీమీటర్ల వాన పడింది.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్లు నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కృష్ణాపూర్‌లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో 6.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 సెంటీమీటర్లు, నిజామాబాద్ దర్పల్లిలో 5.4 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో 5 సెంటీమీటర్లు నమోదైంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మరియు సదాశివనగర్‌లో చెరో 5 సెంటీమీటర్ల వాన పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ టౌన్‌లో భారీ వాన పడింది. నంద్యాల జిల్లా నందిపొట్టుకూరలో రాత్రి నుంచి విరామం లేకుండా వర్షం కొనసాగింది. కర్నూలు జిల్లా ఆదోని, కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com