తెలంగాణ, ఏపీలో తీవ్ర వడగాలులు — పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 21 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ రోజు ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో ఏడు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో నిన్న 45.7°C నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 45.3°C నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్సవాడ మండలంలో 45.2°C నమోదైంది.
వడగాలు వీచే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండ తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న మార్కాపురం జిల్లా కంభంలో 43.3°C నమోదైంది. 14 జిల్లాల పరిధిలో 65 మండలాల్లో 40°C కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి సహా మొత్తం 16 జిల్లాల్లో 42 నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com