తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది; కొత్త సీఎస్ నియామకంపై చర్చ
తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారా లేక కొత్త సీఎస్ ని నియమిస్తారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
1991 బ్యాచ్కు చెందిన రామకృష్ణరావు పదవీకాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. మళ్లీ పొడిగిస్తే అనేక సీనియర్ ఐఏఎస్ అధికారులకు అవకాశం దొరకదని, దీంతో వారిలో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.
కొత్త సీఎస్ ఎవరన్న చర్చలో ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్న జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో మెట్రోపాలిటన్ అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న జయేష్ రంజన్ బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఆయన సర్వీస్ 2027 సెప్టెంబర్ వరకు ఉంది. పరిశ్రమలు, ఐటీ, పట్టణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి రంగాల్లో దీర్ఘకాల అనుభవం జయేష్ రంజన్కు ఉంది.
ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ సెప్టెంబర్ 30న రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర అత్యున్నత అధికార పదవి కోసం ఈ రేస్ త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com