ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా: జూన్ 2 లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా పథకం తీసుకురాబోతోంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ పథకాన్ని ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పథకం కింద బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ₹5 లక్షలు ఆ కుటుంబానికి అందుతాయి. మంత్రివర్గ ఉపసంఘం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ పథకం మార్గదర్శకాలను రూపొందించింది.
ఇదివరకు KCR ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమా పథకం కేవలం రైతులకే పరిమితమైంది. కొత్త పథకం భూమి ఉన్న వారు, లేని వారు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అందరికీ వర్తిస్తుంది.
ఈ నెల 23న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పథకం విధివిధానాలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అదే సమావేశంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, 2 లక్షల కొత్త పెన్షన్లు, health కార్డులు, GHMC ఎన్నికలు సహా పలు అంశాలపై చర్చ జరుగుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com