తెలంగాణలో పర్యాటక విస్తరణకు కొత్త పాలసీ: 2030 లక్ష్యంగా ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, పెట్టుబడులను పెంచడం ఈ పాలసీ ముఖ్య లక్ష్యాలు.
Adventure sports, medical, eco tourism, heritage, food tourism వంటి రంగాలను అభివృద్ధి చేయనుంది పర్యాటక శాఖ. 2030 నాటి అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీని రూపొందించారు.
హైదరాబాద్‌లోని 21 కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించింది ప్రభుత్వం. ఖజానా బిల్డింగ్ సహా జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా గుర్తిస్తున్నారని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. heritage భవనాలను మరమ్మతు చేసి వాటి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు.
పర్యాటక ప్రాజెక్టులకు స్థలాల లీజు విధానంపై మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలు అందించారు. registration చార్జీలు 5% లీజు కరారుతో నిర్ణయించారని తెలిపారు. ఏటా 5% లీజు మొత్తం పెరుగుతుందని చెప్పారు.
మెగా ప్రాజెక్టులకు 66 సంవత్సరాలు, మధ్యతరహా ప్రాజెక్టులకు 33 సంవత్సరాలు, చిన్న ప్రాజెక్టులకు 15 సంవత్సరాల వరకు లీజు పరిమితి నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. private స్థలాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com