హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:39 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ బ్రేకింగ్

తెలంగాణలో మరో నాలుగు రోజులు వడగాల్పులు: 14 జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో మరో నాలుగు రోజులు వడగాల్పులు: 14 జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

నిన్న వడదెబ్బతో తెలంగాణలో 11 మంది మృతి చెందారు. వాతావరణ శాఖ మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని హెచ్చరించింది.

ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ సహా 14 జిల్లాలకు heat wave అలర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు ఎక్కువ ప్రభావానికి గురవుతాయని అధికారులు చెప్పారు.

నిన్న ఖమ్మంలో అత్యధికంగా 45°C నమోదైంది. రామగుండంలో 44.6°C, నిజామాబాద్‌లో 44.4°C, ఆదిలాబాద్‌లో 44.3°C నమోదయ్యాయి. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 39.5°C కి పరిమితమైంది.

ఈ నెల 24న మంచిర్యాల నుండి జనగామ వరకు పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బయట పని చేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మజ్జిగ, ORS, barley water, electrol, మంచినీరు తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com