తెలంగాణ

జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు — CM రేవంత్ రెడ్డి ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు — CM రేవంత్ రెడ్డి ప్రారంభం
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ CM రేవంత్ రెడ్డి జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో స్పెల్లింగ్ తప్పులు, technical సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కరించుకునే వెసులుబాటు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం గుర్తించింది.

రెండో విడతలో ఆ సమస్యలు లేకుండా జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకునేలా అవకాశం కల్పించనున్నారు అధికారులు. అలాగే స్థలం లేని పేదవారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించనుంది.

మొదటి విడతలో ఖాళీ స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారిలో కొందరు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నిజమైన అర్హులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రజావాణి, ప్రజాదర్బారు వంటి కార్యక్రమాల్లో వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com