హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 4:17 PM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోడ్ సేఫ్టీ కోర్సు తప్పనిసరి: తెలంగాణ రవాణ శాఖ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోడ్ సేఫ్టీ కోర్సు తప్పనిసరి: తెలంగాణ రవాణ శాఖ
📷 Thom Gonzalez / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రవాణ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇకపై లర్నర్ లైసెన్స్ పొందిన వారు తప్పనిసరిగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాతే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు అర్హత లభిస్తుంది.

సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు రవాణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కూకట్పల్లి ఆర్టీఓ కార్యాలయ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు 1070 మంది నమోదు చేసుకోగా, 890 మంది కోర్సు పూర్తి చేశారు.

ఈ కోర్సులో 64 అంశాలపై 120 వీడియోలు ఉంటాయి. మొత్తం 2.5 గంటల నిడివి గల ఈ కోర్సును ఆరు మాడ్యూల్లుగా విభజించారు. ప్రతి మాడ్యూల్ తర్వాత క్విజ్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూతో సహా 15 భాషల్లో ఈ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఫేస్ రెకగ్నిషన్ ద్వారా అభ్యర్థి హాజరును నిర్ధారిస్తారు.

కోర్సు పూర్తయిన వారికి రోడ్ సేఫ్టీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితేనే పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు.

ఈ ప్రాజెక్టు అభివృద్ధికి 60% నిధులు యూనిసెఫ్ అందించింది. రవాణ శాఖ కమిషనర్ ఇలంబర్తి అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి ఈ కోర్సును రూపొందించారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటి ఆధారంగా ఈ కోర్సును తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో మానవ తప్పిదాలను తగ్గించడం, కొత్త డ్రైవర్లలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యమని రవాణ శాఖ అధికారులు చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com