తెలంగాణలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల నిరసనలు
తెలంగాణలో పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంపై రైతులు నిరసనలు తెలుపుతున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తాండాలో నరేష్ అనే రైతు ధాన్యానికి నిప్పు పెట్టాడు. కాంటా వేసి ధాన్యం తీసుకెళ్ళలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో రైతులు భీమనపల్లి రహదారిని దిగ్బంధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వర్షం పడడంతో 20,000 క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది.
ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com