తెలంగాణ: పాఠశాలలు పునఃప్రారంభం, విద్యార్థులకు ఉచిత అల్పాహారం
వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా సెలవులను జూన్ 14 వరకు పొడిగించారు.
విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతిరోజు క్రీడలు నిర్వహించాలని, ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 227 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి.
ఇదిలావుండగా, విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రోజూ మెనూతో పాటు ఈ పథకం అమలవుతుంది. అల్పాహారంలో వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావా అందిస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com