విద్యుత్ షాక్‌తో కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శస్త్ర చికిత్స
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఓ యువకుడికి విజయవంతమైన స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్ర చికిత్స చేశారు. ఆరు నెలల క్రితం విద్యుత్ షాక్ గురైన మడప భాస్కర్ అనే యువకుడికి 60% కాలిన గాయాలయ్యాయి.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినా పూర్తిగా కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రమ్మని సూచించిన ఎమ్మెల్యే రెండు నెలల పాటు చికిత్స అందించారు.
నిన్న ఐదు గంటలపాటు శస్త్ర చికిత్స జరిగింది. రోగి తొడ, పొట్ట భాగాల నుంచి చర్మాన్ని తీసి కాలిన చోట గ్రాఫ్టింగ్ చేశారు. ఈ సర్జరీకి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహకారం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
శస్త్ర చికిత్స అనంతరం యువకుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని, మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com