నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయానికి 18 మంది కమిటీ: తెలుగు ఫిలిం చాంబర్
తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సమన్వయానికి 18 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ కమిటీలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి చెరో ఆరుగురు ఉంటారు. ప్రొడ్యూసర్ల తరపున సుప్రియ, బాపినీడు, మైత్రి రవి, చెరుకూరి సుధాకర్, SKN, ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిబిటర్ల తరపున అనుపం రెడ్డి, బాలగోవిందరాజు, ఒంగోలు బాబు, కాకినాడ శ్రీను, ప్రతాప్ రెడ్డి, వైజాగ్ చిన్ని ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ల తరపున సుధాకర్ రెడ్డి, వీరి నాయుడు, ముత్యాల రామదాస్, ధీరజ్, నాగార్జున, ఠాగూరు మధు ఉన్నారు.
ఈరోజు చాంబర్‌లో జరిగిన సమావేశంలో థియేటర్ revenue percentage విధానంపై చర్చించారు. ఎగ్జిబిటర్లు ముందే ప్రతిపాదించిన percentage విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. A, B, C సెంటర్లకు వేర్వేరు percentage నిర్ణయించే బాధ్యత ఈ కమిటీకి అప్పగించారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సమావేశం సానుకూలంగా జరిగిందని, అన్ని వర్గాల సమస్యలు చాంబర్ స్థాయిలో పరిష్కరించుకున్నామని తెలిపారు. జూన్ 4న విడుదల కానున్న సతీష్ నటించిన చిత్రానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com