క్రికెట్

టీజీ-20 లీగ్ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
టీజీ-20 లీగ్ ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం
📷 Tamhasip Khan / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో TG-20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి.

ఇప్పటికే ఆటగాళ్ల వేలం పూర్తయి, అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టాయి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మేదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్ జట్లు నగరంలోని వివిధ మైదానాల్లో సాధన చేస్తున్నాయి.

హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టును ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. హెడ్ కోచ్ అనిరుద్ పర్యవేక్షణలో జట్టు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. 11 లక్షలకు వేలంలో తీసుకున్న అభిరద్ రెడ్డికి కెప్టెన్సీ అప్పగించారు. ఈ లీగ్ యువ క్రికెటర్లకు ప్రతిభా ప్రదర్శనకు మంచి అవకాశమని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.

టోర్నీలో తొలి మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ మధ్య ఈ నెల 21న జరగనుంది. మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:15, రాత్రి 7:15 గంటలకు షెడ్యూల్ చేశారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తన తొలి మ్యాచ్ ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్‌తో ఆడనుంది. టోర్నీ ప్రారంభ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ సమీపంలో డ్రోన్ షో ఏర్పాటు చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com