హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 9:02 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

టీజీపీఎస్సీ 290 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల; దరఖాస్తులకు జూన్ 8 నుండి అవకాశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
టీజీపీఎస్సీ 290 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల; దరఖాస్తులకు జూన్ 8 నుండి అవకాశం
📷 Satya Nandigam / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం 290 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 13 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు, PCB అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలు చూడవచ్చు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com