తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహణ
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ప్రాతఃకాల నైవేద్యాలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామిని బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. విశేష ఆభరణాలు, పుష్పాలంకరణతో స్వామివారిని అలంకరించారు.
అనంతరం స్వామివారికి విశేష నైవేద్యాన్ని సమర్పించారు. ద్వజస్థంభం వద్ద స్వామివారికి, ఉత్సవ మూర్తులకు కొత్త పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఆలయంలో అక్షరోపణం, పంచముఖ కొలువు నిర్వహించారు. స్థాన బహుమానంతో పాటు రూపాయి హారతి, విశేష హారతులు లోక క్షేమార్థం నిర్వహించారు. ఆగమోక్త ప్రకారం అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.
దీపావళి సందర్భంగా ఈరోజు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. దేశ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆలయం తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com