జాతీయం

రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలు: రైల్వే శాఖ దర్యాప్తులో కుట్ర కోణం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలు: రైల్వే శాఖ దర్యాప్తులో కుట్ర కోణం
📷 Mauricio Krupka Buendia / Pexels
షేర్ కాపీ అయింది ✓

భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రైళ్లలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలన్నీ యాదృచ్చికంగా జరిగినవి కాదని రైల్వే శాఖ అంతర్గత దర్యాప్తులో నిర్ధారించినట్లు తెలిసింది.

రాజస్థాన్‌లోని అమరపుర రైల్వే స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రైలు బోగీలోని దిండుకు నిప్పు పెట్టాడు. అదే రాజస్థాన్‌లోని కోటాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు బాత్‌రూమ్ నుంచి వ్యాపించినట్లు దర్యాప్తులో తేలింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిన అగ్ని ప్రమాద స్థలంలో బాత్‌రూమ్‌లో పెట్రోల్ తో తడిపిన గుడ్డముక్క లభించింది.

బీహార్‌లోని సాసారాంలో జరిగిన ఘటన మరింత వేరుగా ఉంది. ప్రయాణికులు లేని, power generator కూడా లేని ఖాళీ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బయట నుంచి గుర్తు తెలియని వ్యక్తి మండుతున్న వస్తువును బోగీలోకి విసిరినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రయాణ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే రైల్వే helpline నంబర్ 139కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com