మహిళా ట్రైనీ IPS లైంగిక దాడి కేసులో ట్రైనీ IPS ఉదయ కృష్ణా రెడ్డి అరెస్ట్
ట్రైనీ IPS ఉదయ కృష్ణా రెడ్డి లైంగిక దాడి ఆరోపణల కేసులో మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయ్యారు. అత్తాపూర్ పోలీసులు ఆయన్ను మిర్యాలగూడ సమీపంలోని తామర్ల చెర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 18వ తేదీన ఓ మహిళా ట్రైనీ IPS అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయ కృష్ణా రెడ్డిపై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 20న ఉదయ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్సార్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయ్యాక ఆయన కనిపించకుండా పోయారు.
ఆయన కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. మంగళవారం సాయంత్రం సొంత ఊరిలో కనిపించిన ఉదయ కృష్ణా రెడ్డి, హైదరాబాద్ వస్తుండగా మిర్యాలగూడ తామర్ల చెర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com