అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం కేంద్ర క్యాబినెట్ రెండు భారీ ప్రాజెక్టులకు నిధులు ఆమోదించింది. రాయపూడి గ్రామంలో 5.35 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్కింగ్ స్పేస్ నిర్మించనున్నారు. అదేవిధంగా అయినవోలు గ్రామంలో 17 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించారు.
2018లో TDP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు భూమిని కేటాయించారు. అయితే 2019లో YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కింది.
మొత్తంగా 40 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. వర్కింగ్ స్పేస్ మరియు రెసిడెన్షియల్ అవసరాల కోసం మొత్తం 2500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ నిర్మాణాల ద్వారా సుమారు 5500 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో విధులు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఈ ఉద్యోగులు విజయవాడ మరియు హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణాలు పూర్తి చేసి ఉద్యోగులను అమరావతికి తరలించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నిధుల ఆమోదం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com