ఉప్పల్ చౌరస్తా మూసివేత: ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను అధికారులు మూసివేశారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనుల కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మూడు నెలల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
GHMC ఆఫీస్ పక్కనున్న వరంగల్ బస్ స్టాప్‌ను ఇప్పటికే ఉప్పల్ నల్లచెరువు కట్ట దగ్గరికి మార్చారు. ఉప్పల్ రింగ్ రోడ్ మీదగా వరంగల్ వైపు వెళ్ళే అన్ని వాహనాలను మళ్ళిస్తున్నారు.
హబ్సిగూడా నుంచి వరంగల్ వైపు వెళ్ళే భారీ వాహనాలు హబ్సిగూడా చౌరస్తా నుంచి నాచారం–మల్లాపూర్–IOC–చెంగిచెర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాలని అధికారులు సూచించారు. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరా గాంధీ పార్క్ నుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి ద్వారా వరంగల్ రహదారికి చేరుకోవాలి.
వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ Asian Cine Theatre ఎదుట HMDA రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు చేరుకోవాలి. two-wheelers నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్–సికింద్రాబాద్ వైపు వెళ్ళాలి. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జ్ కింద U-turn తీసుకొని ఉప్పల్ వైపు రావాలి.
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు, లారీలు, భారీ వాహనాలు ఘట్కేసర్ వద్ద ORR ఎక్కి హయత్‌నగర్ దగ్గర దిగి LB నగర్ మీదగా సిటీలోకి రావాలని అధికారులు సూచించారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమై ఏడు సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా పూర్తి కాలేదు. శనివారం రాత్రి హఠాత్తుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో సోమవారం ఉదయం నుంచి చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యక్ష నివేదికలు తెలుపుతున్నాయి. సైన్ బోర్డ్‌లు తక్కువగా ఉండడం మరో సమస్యగా మారింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com